బచ్చన్నపేట ఏప్రిల్ 14(జనం సాక్షి)ప్రపంచ మేధావి. రాజ్యాంగ నిర్మాత. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి కాకుండా . ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాడని . జనగామ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య. బచ్చన్నపేట స్థానిక ఎస్సై నవీన్ కుమార్ అన్నారు. శుక్రవారం
బచ్చన్నపేట మండలం కేంద్రంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు అంబేద్కర్. బాబు జగజ్జివన్ రావు విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ప్రతిష్టాపన కమిటీ చైర్మన్ కంత్రి సత్తయ్య అధ్యక్షత వహించగా జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన బాగ్య లక్ష్మి అంజయ్య స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా సమాజం మారాలని ఈ సమాజంలో అణగారిన వర్గాల ప్రజల కోసం అనగా పడుతున్నటువంటి ప్రజల కోసం పాటుపడిన గొప్ప నేత అంబేద్కర్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ దేశ వ్యవస్థ నడుస్తుంది అంటే దానికి కారణం అంబేద్కర్ అని ఈ దేశంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క హక్కు ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే అని ఆ రాజ్యాంగం రాసే క్రమంలో ఆయనకు ఎన్ని ఎదురొడ్లు వచ్చినా ఎన్ని అడ్డంకులు సూచించిన అవన్నీ చేదించుకొని అణగారిన వర్గాల ప్రజల కోసం పాటుపడి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా చేశారని మహిళల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం అందరి కోసం పాటుపడిన గొప్ప నేత అంబేద్కర్ అని అలాంటి అంబేద్కర్ను స్మరించుకోవడం మన గౌరవమని. ప్రపంచ దేశాలు అంబేద్కర్ ఆలోచన విధానాలను అనుసరిస్తున్నాయని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు నల్లగొని పుష్ప బాల కిషన్ అల్వాల రాధా ఎల్లయ్య పడమటి కేశపూర్ సర్పంచ్ గిద్దల రమేష్ కె.బి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొండి వెంకటరెడ్డి ఎమ్మార్పీఎస్ జనగామ జిల్లా కన్వీనర్ పైసా రాజశేఖర్ మాదిగ గురజాగుంట జాన్ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మల్యాల బాల్ నరసయ్య ఎమ్మెస్పీ జిల్లా నాయకులు అల్వాల నర్సింగరావు సిపిఎం నాయకులు గొల్లపల్లి బాపురెడ్డి బెల్లంకొండ వెంకటేష్ మడూరి. టిడిపి నాయకులు అల్లాదుర్గం వెంకటేష్. కమ్మడి మహేందర్. చిలుముల రమేష్. చిలుముల మహేష్. వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు అల్వాల రమేష్ యాదగిరి బిజెపి నాయకులు గణేష్ సోమిరెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు వంశీ ఎంఎస్పి నాయకులు పాకాల కుమార్ స్వామి అల్వాల రాజు యూత్ నాయకులు మల్యాల అఖిల్ మాల గన్నమల సమేశ్వర్ దాచుపల్లి అభి కత్తి బన్నీ కర్రె ప్రశాంత్ భాను ప్రకాష్ దేవరకొండ మహేష్ మినలాపురం సిద్ధులు పిల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు




