,గుడిహత్నూర్: ఏప్రిల్, 14( జనం సాక్షి)రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కో ఆప్షన్ మెంబర్ జమిర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నట్లుగానే మైనారిటీ వర్గాల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించి మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తుందని అన్నారు. మసీదులో మత బోదకులైన ఇమామ్ లకు గౌరవేతనం ఇస్తుందన్నారు. అలాగే ప్రతి ఏటా రంజాన్ పండుగకు నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత జాదవ్, బిఆర్ఎస్ నాయకులు రమేష్ జాదవ్, గౌస్ , ఎంఐఎం మండల అధ్యక్షుడు అర్షద్ ఖురోషి తదితరులు పాల్గొన్నారు.




