ప్రపంచ గతిని మార్చింది సైన్స్ మాత్రమే
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే .
రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 9. (జనం సాక్షి). ప్రపంచ గతిని మార్చింది సైన్సేనని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ లో జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలకు శుక్రవారం ముఖ్య అతిధిగా ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే శాస్త్రీయ జ్ఞానాన్ని అలవర్చుకున్నప్పుడు భవిష్యత్తులో గొప్పవారు అవుతారని అన్నారు.నేడు సమాజం ఎంతో పూర్వగామి చెందినప్పటికీ శాస్త్రీయ జ్ఞానం లోపించడం వల్ల మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. వీటితో నేరాలు సైతం విపరీతంగా చోటు చేసుకుంటున్నాయి. వీటిని నిర్మూలించాలంటే విద్యార్థి దశ నుంచే సైన్స్ అవగతం చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిసిఎంబి మాజీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్. మోహన్ రావు, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ విస్వప్రసాద్, సి.ఐ లు అనిల్ కుమార్,ఉపేందర్, మోగిలి, వెంకటేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య , ట్రస్ట్ వ్యవస్థాపకులు రంగినేని మోహన్ రావు ,బాల సాహితివేత్త పత్తిపాక మోహన్ , జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోయ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టి.శ్రీనాథ్ ,కోశాధికారి వరప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు సి. రామరాజు, జిల్లా అధ్యక్షులు గుర్రం ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ , గౌరవ అధ్యక్షులు మార్వాడి గంగరాజు వివిధ జిల్లాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు




