ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం
ఆపద్బాంధవుడు కేసీఆర్ దేవరకొండ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ కొండమల్లేపల్లి డిసెంబర్ 9 జనం సాక్షి న్యూస్ : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం అని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండమల్లెపల్లి మండల కేంద్రానికి చెందిన అరుణకి రూ.1.50లక్షలు మంజూరైన చెక్కును బాధితురాలి మామకి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఆర్థిక భరోసా కల్పిస్తోందని ఆయన అన్నారు.ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమావత్ దస్రు నాయక్,రమావత్ శ్రీను నాయక్ బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం




