Friday, 6 November 2026

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో

వీణవంక డిసెంబర్ 9 (జనం సాక్షి) వీణవంక నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ 76 వ జన్మదినోత్సవ సందర్బంగా వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదినం నిర్వహించడం జరిగింది. టి పి సి సి సభ్యుడు కర్ర భగవాన్ రెడ్డి
సాహెబ్ హుస్సేన్ వారు మాట్లాడుతూ. 60 ఏళ్ల తెలంగాణ పోరాటానికి ముగింపు పలికి ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశ ప్రజలకు మరెన్నో ఆమె సేవలు అవసరమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము
ఈ కార్యక్రమంలో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్,టీపీసీసీ సభ్యులు కర్ర భగవాన్ రెడ్డి, సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, అడిగోప్పల సంపత్, శీలం నర్సింహారెడ్డి, నల్లగొని వీరయ్య, చింతిరెడ్డి కోమల్ రెడ్డి, పర్లపెల్లి ప్రసాద్, గుంపుల గట్టయ్య, మోహన్ రెడ్డి, అజయ్, లక్ష్మణ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.