చెన్నై : ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ కుమారుడి హత్య యుద్థనేరమేనని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. ఈ ఘటనపై శ్రీలంకకు వ్యతిరేకంగా భారత్ తీర్మానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శ్రీలంక అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని, తాము ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని జయలలిత అన్నారు.




