షాద్‌నగర్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తెలంగాణ సెగ తగిలేలా సడక్ బంద్ నిర్వహించాలని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో మాట్లాడుతూ ఆయన కేసులు పెట్టి జైల్లో పెడితే గర్వపడతామే తప్ప సిగ్గుపడం అన్నారు. విధ్వంసం, హింస తమ లక్ష్యం కాదని, అనుమతిస్తే ప్రశాతంతంగా సడక్ బంద్ నిర్వహిస్తామని హరీశ్‌రావు అన్నారు. బైండోవర్ కేసులు పెట్టి అడ్డుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు.




