ప్రభుత్వం కుమ్మర బంధును ప్రకటించాలి➖కొత్తపల్లి గంగాధర్
కుమ్మరుల సంక్షేమ కోసం ప్రభుత్వం వెంటనే కుమ్మర బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి గంగాధర్ కోరారు. త్వరలో జిల్లా కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ సన్నాహక కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మండల కుమ్మరులతో సమావేశం ఏర్పాటు చేయడమైనది.
కుమ్మరులు ఐక్యతతో ఉంటూ హక్కుల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాజారపు లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శిగా ఆరెపల్లి లక్ష్మణ్ మరియు పలువురుని ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి బుచ్చన్న, జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి సురేష్ కుమార్, జిల్లా కోశాధికారి తోడిశెట్టి శంకర్, నాయకులు తోడిశెట్టి రవికాంత్, రాజారపు శంకర్, భుమేష్ కుమార్, సాయిబాబా, గంగరాజం, భోజన్న, సాయన్న తదితరులు పాల్గొన్నారు.