Wednesday, 4 November 2026

ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయడం లేదని ఆవేదన వ్యక్తంఏఎన్ఎం లు

జనం సాక్షి/ కొల్చారంప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రెండవ విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని కొల్చారం మండల రెండవ డిమాండ్ చేశారు. కొల్చారం మండల కేంద్రంలో రెండో ఏఎన్ఎం లు మీడియా సమావేశం నిర్వహించారు ఎంతో కాలంగా తమ విధులు నిర్వహిస్తున్నామని కానీ ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం అమలు చేయాలని ఏఎన్ఎంలు విజ్ఞప్తి చేశారు రోజురోజుకు ధరలు పెరిగిపోయి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తున్న ప్రభుత్వం తమను మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు