జరం సాక్షి దుబ్బాకపదేళ్ల కెసిఆర్ పాలనలో రైతును రాజును చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని పెద్ద గుండావెల్లి ఉప సర్పంచ్ గౌటి స్వప్న రవి పేర్కొన్నారు.దుబ్బాక మండలంలోని పెద్ద గుండావెల్లి క్లస్టర్ లో జరిగిన రైతు దశాబ్ది వేడుకల సందర్భంగా ఆమె పాల్గొని ప్రసంగించారు.పది సంవత్సరాల క్రితం ప్రతి రైతు ఎరువులకు విత్తనాలకు సాగునీటికి విద్యుత్తుకు వేయి కళ్ళతో ఎదురు చూసేవాళ్ళని,వచ్చే మూడు నాలుగు గంటల విద్యుత్ రైతులు పొలాల వద్దనే పడుకొని విద్యుత్ వచ్చినప్పుడే నీరు సరఫరా చేసుకొని రాత్రి వేళల్లో పోలాల వద్దే పడుకుంటే పాములు కారిచి ఎంతమంది రైతులు చనిపోయారని సాగునీటికి, తాగునీటికి అష్ట కష్టాలు పడ్డారని నేడు రైతులకు అన్ని అందుబాటులో ఉన్నాయని అన్నారు, రైతుకు 24 గంటల విద్యుత్ సాగునీరు, తాగునీరు మార్కెట్లో ఎరువులు అందుబాటులో ఉండడం విత్తనాలు అందుబాటులో ఉంటున్నాయని,పంటకు ఎకరాకు 5000 రూపాయలు రైతుబంధు ఇస్తున్నాడని ఏకారణంగా చేతఆయినా రైతు చనిపోతే అతని కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇస్తు కుటుంబాన్ని రైతు భీమా ద్వారా ఆదుకుంటున్నారని అన్నారు, పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు రైతు నేడు సుఖంగా జీవిస్తున్నారని అన్నారు. 10 సంవత్సరాల క్రితము నేటికీ జరుగుతున్న అభివృద్ధి పనులను మీరే చూస్తున్నారని మరోసారి బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు ప్రతి ఒక్క రైతు బీమాకు ఒక్కో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం 3600 ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం కడుతుందని ఎలాంటి కారణం చే అయిన చనిపోయిన రైతు ఇంటికే 5 లక్షల రూపాయలు అందుతాయని అన్నారు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాల
రైతులకు అమలు చేస్తున్నారని తెలంగాణ ఆదర్శంగా తీసుకొని అమలు చేయాలని ఇతర రాష్ట్రాల వారు ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు, వానాకాలం వరిని ముందస్తుగా సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రకృతి వైపరీత్యాలలో నుండి కాపాడుకోవడానికి యాసంగి పంటలను ముందుగానే వెయ్యాలని శాస్త్రవేత్తలు సూచించారని దానికి అనుగుణంగా రైతులు వరి పంటను వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి దుబ్బాక వైస్ ఎంపీపీ అస్కా రవి,ఉపసర్పంచ్ గౌటి స్వప్న రవి, ఎంపిటిసి పరికి రవి,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కోల వెంకట స్వామి గౌడ్ చిన్ని సంజీవరెడ్డి రైతు సమన్వయకర్త నక్కల రాఘవరెడ్డి ,జానయ్య, వార్డ్ మెంబర్లు బంధుగుల ప్రశాంత్ ,పంజ మల్లేశం, టిఆర్ఎస్ నాయకులు కొండ్ర యాదగిరి నక్కల బుచ్చిరెడ్డి నక్కల దామోదర్ రెడ్డి, పంజా కిష్టయ్య గ్రామ సెక్రెటరీ దీక్షిత్ గౌడ్ వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు




