Tuesday, 3 November 2026

‘ప్రభుత్వం దిగిరావాలి లేదా దిగిపోవాలి’

విజయవాడ : ప్రతిపక్షాల మధ్య వైరుధ్యం వల్లే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీ.వీ.రాఘవులు ఆదివారం విజయవాడలో వెల్లడించారు. సీఎంకు ధైర్యముంటే ఈఆర్‌సీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్త్యురాలను బహిరంగ పరచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్టీల మధ్య వైరుధ్యం ఉన్న విద్యుత్‌ ఆందోళనలో అన్ని పార్టీలు ఐక్యంగా పోరాటం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్‌ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం దిగిరావడం లేదా అధికారం నుంచి దిగిపోవడం కాని జరగాలని బీ.వీ రాఘవులు తెలిపారు. విద్యుత్‌ ఛార్జీలు పెంపునకు నిరసగా ఏప్రిల్‌ 9న బంద్‌కు పిలుపు నిచ్చినట్లు బీ.వీ. రాఘవులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *