(ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి)—– జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. మం గళవారం జిల్లా కేంద్రంలోని జన్మభూమినగర్లో గల చార్వాకట్రస్టు భవన్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు, తుమ్మిడి హెట్టి నిర్మాణం, కాళేశ్వరం నీటి వల్ల మంచిర్యాల జిల్లాకు పొంచి ఉన్న ముప్పుపై నిర్వహిం చిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశానికి సభాధ్యక్షునిగా బాబన్న వ్యవహరించారు. ఈ సం దర్భంగా కోదండరాం మాట్లాడుతూ గోదావరి, పెన్ గంగా, కడెం, వార్తా ప్రాజెక్టుల నుంచి వచ్చిన నీటిని సీఎం కేసీఆర్ ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని గోదావరి నీటిని తలాపున ఉంచుకుని కూడా ఈ ప్రాంత రైతులు వినియోగిం చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో తుమ్మిడి హెట్టి ప్రాజెక్టును కడితే చెన్నూరు నుంచి ఆసిఫాబాద్ వరకు నాలుగు జిల్లాల మేర రైతులు బాగుపడతారని పేర్కొన్న సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన హామీని విస్మరించి పూర్తి భిన్నంగా వ్యవహరించి ధనార్జనే ధ్యేయంగా కమీషన్లకు తలొగ్గి కాళేశ్వరా ప్రాజెక్టు చేపటి రూ. 70 వేల కోట ప్రాజెక్టును లక్షా 50 వేల కోటప్రాజెక్టుగా రీ డిజైనింగ్ చేసి తన కుటుంబీకులకు కాంట్రాక్టులు ఇచ్చి కోట్ల రూపాయలను కొల్లగొట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరందలేదని, కేవలం ధనార్జనే ధ్యేయంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మం చిర్యాల జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. తద్వారా సుందిళ్ల బ్యాక్ వాటర్ పారకం లేక నీరు నిల్వ ఉండి మంచిర్యాల, చెన్నూరు, జైపూర్ ప్రాంతాల్లో తీవ్ర విపత్తు సంభవిస్తుందని, ఇది కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లనేనన్నారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని ఎవరు పట్టించుకోనవసరం లేదని, ప్రజాక్షేత్రంలోనే వారికి తగిన బుద్ది చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన నష్టాన్ని కేసీఆర్ అవలంభించిన తప్పుడు విధానాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు సీఎం కేసీఆర్ చేసిన నిర్వాకం ప్రజా వ్యతిరేక పాలనను వివరిస్తామన్నారు.
ప్రజలను విస్మరిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిం చాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నీటి హక్కుల కోసం. ప్రజలు గొంతెత్తాలని, మరో మిలిటెంట్ ఉద్యమాన్ని మా నీరు మాకు అనే నినాదంతో దీర్ఘకాలిక పోరాటానికి సిద్దం కావాలన్నారు. జిల్లాలో తుమ్మిడి హెట్టి ప్రాజెక్టును ప్రభుత్వం మెడలు వంచి నిర్మించేంత వరకు పోరాడుతామన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు కోల్బెల్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.ప్రజలను విస్మరిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిం చాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నీటి హక్కుల కోసం. ప్రజలు గొంతెత్తాలని, మరో మిలిటెంట్ ఉద్యమాన్ని మా నీరు. మాకు అనే నినాదంతో దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధం కావాలన్నారు. జిల్లాలో తుమ్మిడి హెట్టి ప్రాజెక్టును ప్రభుత్వం మెడలు వంచి నిర్మించేంత వరకు పోరాడుతామన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు కోల్బెల్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తూర్పు జిల్లా సస్యశ్యామలం కోసం పోరాడాలన్నారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు నిర్మించకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఈ నిర్లక్ష్య పాలనను తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని, ప్రజా సంక్షేమాన్ని కోరే ప్రభుత్వాలు రావాలన్నారు. ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం లభించేలా అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంతంలోనే మరో తెలంగాణ ఉద్యమంలాంటి ఉద్యమాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వానికి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. వర్షాకాలంలో మంచిర్యాల జిల్లాను రక్షణాత్మకంగా తీర్చిదిద్దడం లో ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, ఈ ప్రాంత నాయకులు తనతో ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండాలని, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలందించేందుకు ప్రతి ఒక్కరు కలిసి రావాలన్నారు. ఈ సమావేశంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్. ప్రాజెక్టుల రిటైర్డు ఇంజనీర్ విఠల్ రావు,పాపిరెడ్డి, జల సాధన సమితి నాయకులు కేవీ ప్రతాప్, కో కన్వీనర్ నైనాల గోవర్ధన్, ప్రజా సంఘాల నాయకులు నైనాల వెంకటేశ్వర్లు, జయరావు, శ్రీనివాస్, అజ్మీర లాల్ కుమార్, తోకల తిరుపతి, ప్రదీప్, కుమార్, సతీష్ యాదవ్, రాజేందర్ రెడ్డి, దుర్గం ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.




