గద్వాల నడిగడ్డ, మే 8 (జనం సాక్షి);ప్రభుత్వానికి , ప్రజలకు మధ్యవారదిగా పని చేస్తున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి మా వంతు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా లోనీ అక్షయ బకెట్ హాల్ లో టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా మహా సభలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజల్వన చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలపటం, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిలాగ పని చేస్తున్నారని, మీడియా అన్నది ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని, మేజిస్ట్రేట్ , ఎగ్జిక్యూటివ్ , జూడిసియల్ ఆనే మూడు స్తంభాలుగాఉంటే మీడియా నాలుగవ స్తంభంగా ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందనిఅన్నారు. . జిల్లాలో పత్రిక విలేకరులు పత్రికల ద్వారా జిల్లా లో జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటిని ప్రజలకు సమాచారం ఇవ్వడం జరుగుతుందని , ప్రజల నుండి వచ్చే సమస్యలను ప్రతి రోజు వాట్సాప్ ద్వారా సమాచార మిస్తున్నారని, మీడియా విలేకరులను అభినందించారు. మీడియా విలకురులకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని తెలియజేశారు. జిల్లా స్థాయిలో నియోజకవర్గస్థాయిలో, మండల స్థాయిలో ఉండే జర్నలిస్టులు వారి అనుభవం కలిగిన సర్టిఫికెట్లు తీసుకొని కమిటీ ద్వారా అక్రిడిటేషన్ కార్డ్స్ , హెల్త్ కార్డ్స్ , బస్సు పాస్ లను జారి చేయడం జరిగిందని తెలిపారు. ఇండ్ల స్టలాలు కేటాయించడం కోసము ఆలంపూర్ నియోజకవర్గం, గద్వాల నియోజక వర్గ శాశనసభ్యుల తో మాట్లాడి ప్రభుత్వభూమి ఉన్న చోట గుర్తిస్తామని తెలిపారు.జిల్లా మీడియా విలేకరులందరూ లక్ష్యం తో ముందుకు సాగాలని, మావంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమములో టీయుడబ్లూజే ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ,కార్యవర్గ సభ్యులు గుడి పల్లి శ్రీనివాసులు,వెంకటేశ్వర్ రావు, రవీందర్,జిల్లా అధ్యక్షుడు శ్యాం,మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల , పత్రిక విలేకరులు, తదితరులు పాల్గొన్నారు.




