యువత క్రీడల్లో రాణించాలి
– గండూరి కృపాకర్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : యువత క్రీడల్లో రాణించాలని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గండూరి కృపాకర్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని 45 వార్డులో యువ క్రీడాకారులకు స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా క్రికెట్ కిట్ ను బహుకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద సూచించిన మార్గంలో యువత నడవాలని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, స్నేహ భావానికి , దేహదారుఢ్యానికి దోహదపడుతాయని అన్నారు.చదువుతోపాటు క్రీడల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు డింగి కర్ణాకర్ ,సాలయ్య , వెంకటేష్ , క్రీడాకారులు ఐతరాజు నవీన్ , గణేష్, నాగార్జున , నవీన్, వీరు , అనిల్, శ్రీనాథ్, రాజశేఖర్, సైదులు, జగన్, లక్ష్మణ్, అశోక్, సునీల్, ఉపేందర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.




