ప్రభుత్వ ఉద్యోగి,హిందుత్వ సంఘాల మధ్య కేసుల పరంపర.
కోటగిరి జనవరి 5 జనం సాక్షి:-నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనతో ప్రభుత్వ ఉద్యోగి, హిందుత్వ సంఘాల మధ్య కేసుల పరంపర కొనసాగుతున్నది. వివరాలలోకి వెళ్ళితే గత మూడు రోజుల క్రితం కోటగిరి మండల కేంద్రంలోని జెడ్ పిహెచ్ఎస్లో పనిచేస్తున్న తెలుగు పండిత్ గతంలో విద్యార్ధులకు సరస్వతి దేవిని పూజించొద్దు,దేవుళ్ళను నమ్మవద్దు అని చెప్పడంతో ఆ విషయం బిజెపి,హిందుత్వ సంఘాల నాయకులకు తెలియడంతో వారు వెంటనే పాఠశాలకు చేరుకొని తెలుగు పండిట్ కు దేవుని సన్నిధిలో క్షమాపణలు చెప్పించడం జరిగింది.ఇంతటితో ఈ విషయం సమస్సిపోకుండా ప్రభుత్వ ఉద్యోగి,హిందుత్వ సంఘాల వారు ఒకరి పైన మరొకరు కేసులు పెట్టుకోవడం జరిగింది.తెలుగు పండిత్ మల్లికార్జున్ ఫిర్యాదు ప్రకారం కోటగిరి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్ అనే వ్యక్తిని కోటగిరి,కోటగిరి చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ఐదుగురు హిందుత్వ సంఘాల వారు,ఉద్యోగిని క్లాస్ రూం నుండి బయటకు పిలిచి దుర్భాషలాడుతూ,కుల రిజర్వేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొంది దేవుళ్ళ ను అవమానపరుస్తారా అని కులం పేరుతో దూషిస్తూ, తోసెస్తూ, చంపుతామని బెదిరిస్తూ పబ్లిక్‌లో అవమానపరిచారనే ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామ ని తెలిపారు.అదేవిధంగా హిందుత్వ సంఘాల నాయకు ల ఫిర్యాదు ప్రకారం జెడ్పిహెచ్ ఎస్ కోటగిరిలో పని చేస్తున్న తెలుగు పండిత్ మల్లికార్జున్ గత ఐదు,ఆరు నెలల నుండి విద్యార్థులకు హిందూ దేవతలను దూషిస్తూ, దుర్భాషలాడుతూ దేవుడు లేడని,సరస్వతి దేవిని నమ్మవద్దని హిందూ దేవి దేవతలపై అసత్య ప్రచారాలు చేస్తూ పిల్లలకు బలవంతపు మత మార్పిడిలకు ప్రోత్సహిస్తు న్నారని సంఘాల వారి ఫిర్యాదు మేరకు ఎస్సై మచ్చెందర్ రెడ్డి,మల్లికార్జున్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.




