Wednesday, 4 November 2026

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి న్యాయం జరగాలి : ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి న్యాయం జరగాలి : ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్

కొండమల్లేపల్లి జనవరి 6 జనం సాక్షి న్యూస్ :
ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేడు కొండ మల్లేపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న మల్లికార్జున అనే ఉపాధ్యాయుడిని ఈనెల 2న కొందరు వ్యక్తులు ప్రభుత్వ పాఠశాల నుండి బవంతంగా బయటికి తీసుకువీళ్లి తీవ్రంగా అవమానపరిచారు. ఉపాధ్యాయుడు ఈ ఘటనపై కలతచెంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేటికి నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణం అన్నారు. ఈ ఘటన అంతా పోలీసుల సమక్షంలో జరిగిన కూడా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. చట్టానికి లోబడి పని చేస్తున్న వ్యక్తులపై ఇలాంటి ఘోరం జరగడం చాలా దారుణం అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం కల్పించినబడినటువంటి హక్కులు కొందరు వ్యక్తులు రాజకీయ పార్టీ అండదండలతో ఈ విధంగా హరించి వేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనలో దళితుడైన ఉపాధ్యాయునికి న్యాయం జరగాలని అన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. తక్షణమే సీఎం స్పందించి ప్రభుత్వ చట్టాలకి లోబడి పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడికి న్యాయం జరిగే విధంగా పోలీస్ వారిని ఆదేశించాలన్నారు. దళితులపై ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నల్గొండ జిల్లా నాయకులు ఆడేపు సతీష్, పెరుమళ్ళ వినోద్ కుమార్, మళ్ళీ కంటి ఆంజనేయులు, కొండమల్లేపల్లి మండల అధ్యక్షుడు CH. గోపాల్, గుర్రంపొడు మండల కన్వీనర్ అందుగుల పరమేష్, తదితరులు పాల్గొన్నారు.