ఖమ్మం అర్బన్,జనవరి 26(జనంసాక్షి) బహుజన జెసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ దేశ బోయిన సంపత్ గురువారం వరంగల్ క్రాస్ రోడ్డు లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభ సందర్భంగా మనం జరుపుకుంటున్న భారత గణతంత్రం సంబరాలు మునుముందు కూడా ఇదేవిధంగా ఘనంగా జరుపుకోవడం కోసం మనం మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ దుంపటి సందీప్, పాలేర్ కన్వీనర్ సర్వ నాగసంతోష్, నాయకులు పేరంపల్లి నాగార్జున, బొబ్బిలి కృష్ణ, వెంపటి కోటయ్య, కోట సుమంత్ రెడ్డి, వేల్పుల రమేష్, కోటి, వినోద్, రమేష్, మెడికంటి రామిరెడ్డి, గుండేపూడి శశిధర్, టీ టైం మహేష్, అందనాల నవీన్, వినయ్, సల్లూరి పృద్వి, బయ్య మహేష్ తది తరులు పాల్గొన్నారు.




