Thursday, 5 November 2026

ప్రభుత్వ చీఫ్ దాస్యం పుట్టినరోజు కై అనేక సేవా కార్యక్రమలు

ప్రభుత్వ చీఫ్ దాస్యం పుట్టినరోజు కై అనేక సేవా కార్యక్రమలు

-58 వికలాంగులకు విల్ చైర్స్ బహుకరణ..

-పరిశుద్ధ కార్మికులకు సన్మానలు
-మెడికల్ క్యాంప్,బ్లడ్ డొనేషన్ కార్యక్రమలు

హన్మకొండ బ్యూరో చీఫ్ 22 జనంసాక్షి

తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విఫ్, వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ పుట్టినరోజు సందర్బంగా, టీఆర్ఎస్వి కేయు అధ్యక్షుడు భైరపాక ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన కార్యక్రమానికి ముఖ్యతిధిగా హాజరై గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా నేడు 58 మంది వికలాంగులకు వీల్ చైర్స్ ను మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి , విద్యార్ధి నాయకలతో కలసి పంపిణి చేసిన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా. కె. వాసుదేవ రెడ్డి,
ఈ సందర్బంగా చైర్మన్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ…..ఎమ్మెల్యే
దాస్యం వినయ భాస్కర్ పుట్టిన రోజు సందర్బంగా గత 5రోజులుగా విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్, స్కూల్ విద్యార్థులకు బుక్స్, ఎక్సమ్ పాడ్స్ ,పెన్స్, మరియు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానాలు, హెల్త్ కిడ్స్, హాస్పిటల్ పేషంట్స్ కు పండ్ల పంపిణి లాంటి అనేక సేవ కార్యక్రమాలు చేయడం సంతోషమని, వినయభాస్కర్ ప్రజల మనిషి అని, నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల కష్టాలలో సుఖలాల్లో పాలుపంచుకొనే మంచి మనసు, మానవత్వం ఉన్న ప్రజా ప్రతినిధి,అందిరివాడుగా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరితో కలివిడిగా ఉంటు దాస్యం అంటేనే దైర్యం అని నియోజకవర్గంలో ప్రజలు భావిస్తారని అలాంటి మనిషి పుట్టిన రోజు అందరికి పండుగనే అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రాజకీయంగా మునుముందు పెద్ద పెద్ద అవకాశలు రావాలని కోరుకుంటూ,వారు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యలతో, అష్టైశ్యర్యాలతో ఉంటూ,ఎల్లపుడు ప్రజా ప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని ఆభగవంతుణ్ణి కోరారు.
కార్యక్రమంములో కార్పొరేటర్ నర్సింగ్,మాజీకార్పొరేటర్ జోరిక రమేష్, రాష్ట్ర యువజన నాయకులు బి. వీరేందర్, టీఆర్ఏస్వి నాయకులు ఎమ్. శరత్ చంద్ర, జెట్టి రాజేందర్, సుమన్,వీరు, సూర్య కిరణ్,నాగరాజు,మధు,కోనకటిప్రశాంత్ డెక్క రాంబాబు,దగ్గుల వినోద్ ,కళ్యాణ్ ,విక్రం ,బబ్బులు, రోహిత్ ,52 డివిజన్ అధ్యక్షులు సుగుణార్ రెడ్డి,తదితర నాయకులతో పాటు, లబ్ది దారులు పాల్గొన్నారు.