ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన డీఈఐఓ.
ఇంద్రవెల్లి: జనవరి 7 (జనం సాక్షి)మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మాధ్యమిక విద్యాదికారి సి.రవీందర్ శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని తరగతి గదులను, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. సాధారణ సిలిబస్ తో పాటు ప్రాక్టికల్ సిలబస్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ ప్రతి రోజు కళాశాలకు విధిగా హాజరు కావాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఎమ్మ్సేట్ ,నీట్, సంబంధించిన ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలిని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి.ధన్ రాజ్ అధ్యాపకులు రాథోడ్ శ్రావణ్, శ్రీనివాస్ స్వామి, వేంకటేశ్ , సీనియర్ అసిస్టెంట్
మల్లేశం భోధన బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన డీఈఐఓ.




