Wednesday, 4 November 2026

భగవాన్ బాబా చూపిన మార్గాన్ని అనుసరించాలి

భగవాన్ బాబా చూపిన మార్గాన్ని అనుసరించాలి:

పిఎసిఎస్ చైర్మన్ డోంగ్రే మారుతి…

ఇంద్రవెల్లి: జనవరి 7 (జనం సాక్షి)సంత్ భగవాన్ బాబా చూపిన మార్గంలో నడవాలని పిఎసిఎస్ చైర్మన్ డోంగ్రే మారుతి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో భగవాన్ బాబా వర్ధంతిని జరుపుకున్నారు. ముందుగా పలువురు భగవాన్ బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో మార్పు తేవడానికి భగవాన్ బాబా ఎనలేని కృషి చేశారని అన్నారు. నిరంతరం ప్రజలను చైతన్య పరుస్తూ ఉండేవారని అన్నారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ సంత్ భగవాన్ బాబా చూపిన మార్గంలో నడవాలన్నారు.

ఈ కార్యక్రమంలో వంజారి సంఘం పెద్దలు ముస్లే కేశవ్, మారుతి మహారాజ్, ముండే రాజేశ్వర్, ముండే బాబు, మాజీ ఎంపీపీ కనక తుకారాం, గాయక్వాడ్ నారాయణ, గైను తదితరులు పాల్గొన్నారు.