సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం.
ఆకట్టుకున్న సంక్రాంతి ముగ్గుల పోటీ సంబరాలు..
ఊరుకొండ, జనవరి 6 (జనంసాక్షి):
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం.. ఆడపడుచుల అభిమాన పండగ సంక్రాంతి ముగ్గుల సంబరాలు అని శ్రీ వేంకట బాల్ రామయ్య పాఠశాల చైర్మన్ సామల తిరుపతయ్య అన్నారు. శనివారం ఊర్కొండ మండల కేంద్రంలోని శ్రీ వేంకట బాల్ రామయ్య పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన ముగ్గుల పోటీలో 30 మంది పాల్గొనీ వేసిన రంగురంగుల రంగవల్లులు (ముగ్గులు) చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాఠశాల చైర్మన్ సామల తిరుపతయ్య, పాఠశాల డైరెక్టర్ సామల గీత,
ప్రిన్సిపాల్ తంగచెన్ లు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ పల్లె జీవనాన్ని, ఉనికిని ప్రతిబింబిస్తుందని, రైతులకు ఎంతో ముఖ్యమైన పండుగ అని తెలియజేశారు. ప్రకృతిని గౌరవిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మనిషి జీవితాన్ని కొనసాగించాలని.. సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ అని తెలిపారు. సాంస్కృతిక అంశాలు మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి, ఏకాగ్రతకు ఎంతగానో దోహదపడుతాయని తెలియజేశారు. అనంతరం పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థుల తల్లిదండ్రులు.. ప్రథమ బహుమతి పదులె పునమ్ పరమేష్ మాధారం, ద్వితీయ బహుమతి మల్లికేడి కల్పనఉసేన్ మాధారం, తృతీయ బహుమతి కుడుముల పావనిజంగారెడ్డి ముచ్చర్ల పల్లి గార్లకు బహుమతుల ప్రధానం చేశారు. అదేవిధంగా పాఠశాల ఉపద్యాయురాళ్లకు నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, యువత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం. ఆకట్టుకున్న సంక్రాంతి ముగ్గుల పోటీ సంబరాలు.




