Thursday, 5 November 2026

ప్రభుత్వ జూనియర్ కళాశాల (సైన్స్ వింగ్) నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.

ప్రభుత్వ జూనియర్ కళాశాల (సైన్స్ వింగ్) నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.
కరీంనగర్ టౌన్ నవంబర్ 7(జనం సాక్షి)
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమ వారం ప్రభుత్వ సైన్స్ వింగ్ జూనియర్ కళాశాల ను సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో కర్ఖన గడ్డ వద్ద ఉన్నటు వంటి ప్రభుత్వ జూనియర్ సైన్స్ వింగ్ కళాశాల ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శం చూపినటువంటి కళాశాల ఈరోజు శిథిలా వ్యవస్థలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి దాదాపు సంవత్సరం నర గడుస్తున్న కానీ ఇంతవరకు నూతన భవనాలు పూర్తిస్థాయిలో పనులు పూర్తి కాలేదు కావున పనులను వేగవంతం చేయాలని అన్నారు, కళాశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కళాశాల నిర్మాణ దశలో ఉన్నందున విద్యార్థులు పాత క్లాసులలో చదువుకుంటున్నారని ఎప్పుడు ఊడిపోతుందో అనే విధంగా పెంకసు బిచ్చలు ఎప్పుడు తల మీద పడతాయి అనే విధంగా ఉండడం విద్యార్థుల్లో ఆందోళన కల్గిస్తుంది. కళాశాల మొత్తంలో మూత్రశాలలు లేకపోవడం ద్వారా విద్యార్థులు కళాశాల ఆరుబయట వెళ్లల్సిన పరిస్థితి వస్తుందని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పనులు ప్రారంభం అయ్యి సంవత్సరం అయిన కానీ పనులను కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వ అధికారులు స్పందించి నిర్మాణం కోసం ప్రత్యేక నిధులను కేటాయించి కళాశాల భవనాన్ని నిర్మాణం చేసి విద్యార్థులకు అందేలా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కంపెల్లి అరవింద్ నగర్ ఉపాధ్యక్షులు నాగుల శివ కుమార్ నగర సహాయ కార్యదర్శి ఆసంపెల్లి వినయ్ నాయకులు ఈశక్,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.