హుజూర్ నగర్ మే 28 (జనంసాక్షి):
మోతే మండలం విభాలపురం గ్రామంలో ఆదివారం డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలను అరికట్టి అర్హులైన పేదలకు డబుల్ బెడ్లు ఇండ్లు కేటాయించాలని ఆందోళన చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సిపిఎం మండల కార్యదర్శి గోపాల్ రెడ్డి, సిపిఎం నాయకులు పైన పోలీసులు మూకమ్మడిగా దాడి చేయటాన్ని ప్రజాతంత్ర వాదులు మేధావులు ఖండించాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసనబోయిన హుస్సేన్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని అమరవరం గ్రామ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఏకపక్షంగా చేశారని అర్హులైన పేదలకు అందేలా చేయాలని సామరస్యంగా ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకుల పైన పోలీసులు దాడి చేయడం అన్యాయం అని వారన్నారు. వెంటనే సిపిఎం నాయకులు పై పెట్టిన కేసులను ఎత్తివేసి అర్హులైన పేదల లిస్టు ఫైనల్ చేసి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజా సంఘాల నాయకులు శాఖ కార్యదర్శి షేక్, ఖాసిం కదిర, రామ నరసమ్మ షేక్, సైదా తేనె, సీతారాములు తేనె, బాల సైదులు, కృష్ణారెడ్డి సిఐటియు నాయకులు కందుల, వీరస్వామి బుద్ధి బాల సైదులు తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం నాయకుల పైన పెట్టిన అక్రమ కేసును ఎత్తు వేయాలి -వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసనబోయిన హుస్సేన్




