ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలి : బిఆర్ఎస్ఎస్
మోత్కూరు డిసెంబర్ 16 జనంసాక్షి : మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నాడు మోత్కూరులో ఈ మేరకు బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల,డిపో ఏర్పాటుకై స్థానిక శ్రీకాంత్ చౌరస్తా వద్ద ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మోత్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల పేద,మధ్య తరగతి ఉన్నత విద్యకు నోచుకోలేక తమ చదువులను ఇంటర్మీడియట్ వరకే స్వస్తి చెప్పావలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడున్నర దశాబ్దాల నుంచి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలకు చలనం లేకుండా పోయిందని అన్నారు. అదే విధంగా ఇక్కడ ఆర్టీసీ డిపో లేకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు తమ చదువును అర్ధతరంగా పదో తరగతి వరకే స్వస్తి చెప్పవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంతంత్య వెనుకబడి ఉన్న మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ,ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయుటకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని యెడల దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్.ఎస్ జిల్లా నాయకులు నిమ్మల శ్రీనివాస్ యాదవ్, పట్టణ నాయకులు చిర్ర బోయిన కొమురయ్య,గనగాని నాగేష్,శెట్టి వేణు,కడమంచి కార్తీక్,బోడ సోమనర్సయ్య ఏర్పుల,అనంతయ్య,బుంగ యాదయ్య,పెరమాండ్ల ప్రవీణ్, వై.స్వామి,ఉండ్రాల నవీన్ ఎస్.విజయ్ తదితరులు పాల్గొన్నారు.




