Thursday, 5 November 2026

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ వేంటనే చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ వేంటనే చేయాలి

విలేకర్ల సమావేశంలో టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 16,
జనం సాక్షి :
మెటుపల్లి పట్టణంలో ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే రుణమాఫీ అవుతుంది అని ఆశతో అప్పూలు చేసి మరీ రైతులు వాటికి మిత్తి కడుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు రాజశేఖర్ రెడ్డి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసింది అని గుర్తు చేశారు.. అదే విధంగా రైతు బంధు ఇప్పటి వరకు రైతుల ఖాతాలో జమ కాలేదు అని అన్నారు. ఎన్నికల వున్నప్పుడే ముఖ్యమంత్రి కి రైతు బంధు గుర్తు వస్తది అని అన్నారు. తక్షణమే రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్సారెస్పీ ఈఈ తో మాట్లాడుతూ నీళ్లు విడుదల చేయాలని కోరగా ఈఈ సానుకూలంగా స్పందించారు.. అనంతరం నిన్న ఒక టీవీ ఛానలో మేము పార్టీ మారుతున్నట్టు వార్త వచ్చిద్ది దానిని మేము పూర్తిగా కండిస్తున్నం అని జువ్వాడి కృష్ణ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దు అని అన్నారు తాము కాంగ్రెస్ పార్టీ లోనే ఉంటాం అని అన్నారు.. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె. లింగారెడ్డి. మెటుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి. కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగధర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందే మారుతీ.రాజు తదితరులు పాల్గొన్నారు