ప్రభుత్వ పథకాలపై క్షేత్ర స్థాయిలోవిస్తృత ప్రచారం నిర్వహించాలి.ప్రభుత్వ పథకాలపై క్షేత్ర స్థాయిలోవిస్తృత ప్రచారం నిర్వహించాలి.
జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథo
రాజన్నసిరిసిల్లబ్యూరో. డిసెంబర్ 01 ,(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథo తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను అదేశించారు.గురువారం కలెక్టరేట్ లో జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం మాట్లాడుతూ పేదల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తున్నదని . పథకాల సమాచారం ప్రజలకు చేరేలా చూడాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నిర్దేశిత షెడ్యూల్ కు అనుగుణంగా ప్రచారం కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. రోజువారీగా క్షేత్ర స్థాయిలో కళాకారుల చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి గ్రామ పంచాయితీ కార్యాలయంధ్రువీకరించిన పత్రాలు, ఫోటోలు హైదరాబాద్ లోని హెడ్ ఆఫీస్ తెలంగాణ సాంస్కృతిక సారథి హెడ్ ఆఫీస్ కార్యాలయం కు ,జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం కు పంపించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి ఆదేశించారు.ఈ సందర్భంగా కళాకారుల కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రధాన కార్యాలయం అందజేసిన మొబైల్ సౌండ్ సిస్టం ను కళాకారులకు అందజేశారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారథులు గా విధులు నిర్వర్తించి కామారెడ్డి , జగిత్యాల జిల్లాకు బదిలీ అయిన కళాకారులను జిల్లా పౌర సంబంధాల అధికారి శాలువా, మెమెంటో తో సత్కరించారు. కార్యక్రమంలో సాంస్కృతిక సారధి కళాకారులు. డి పి ఆర్ ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలపై క్షేత్ర స్థాయిలోవిస్తృత ప్రచారం




