Monday, 2 November 2026

ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టిన హుజూర్‌నగర్‌ ఫలితం

ప్రజల తీర్పుతో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం
వారి ఆశీర్వాదం టానిక్‌లా పనిచేస్తుంది
విపక్షాల దుష్పచ్రారాలు తిప్పికొట్టిన ప్రజలు
ఇదో అద్భుత విజయం తప్ప ఆషామాషీది కాదు
తెలంగాణ భవన్‌లో విూడియాతో సిఎం కెసిఆర్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌24(జనం సాక్షి): ప్రభుత్వం తన పద్దతిలో తెలంగాణ పురోగతికి చేస్తున్న పనులకు హుజూర్‌ నగర్‌ ఫలితం ద్వారా ప్రజలు మరింత ఉత్సహాంతో పనిచేయడానికి అవకాశం కల్లించారని సిఎం కెఇసార్‌ అన్నారు. ఇది తమకు టానిక్‌లాగా పనిచేస్తుందన్నారు.  హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అఖండ మెజార్టీ ఇచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని అందించినటువంటి  నియోజకవర్గ ప్రజలందరికీ సీఎం కేసీఆర్‌ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక విజయం అనంతరం సీఎం తెలంగాణ భవన్‌లో విూడియాతో మాట్లాడుతూ… ప్రతీకూల వాతావరణ పరిస్థితుల్లో తాను వెళ్లలేక పోయినప్పటికీ కూడా ప్రజలు అద్భుత మెజార్టీ ఇచ్చారని అన్నారు.  ఇది ఏదో ఆశామాషీగా అలవోకగా వేసిన వేటు అనుకోవటం లేదు. చాలా ఆలోచన చేసి వేసినట్లుగా భావిస్తున్నాంమని అన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంవత్సర కాలంలో జరిగినటువంటి ఉపఎన్నిక ఇది. పనిచేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వానికి ఈ విజయం ఒక టానిక్‌లాగా పనిచేస్తుందన్నారు.  ప్రతిపక్షాల పార్టీలు చాలారకాల దుష్పచ్రారాలు చేశారు. చాలా నీలాపనిందలు వేశారు. వ్యక్తిగతమైన నిందలు సైతం చేశారు. వాటన్నింటిని పక్కనపెట్టి మా అభ్యర్థి సైదిరెడ్డిని 43 వేల మెజార్టీ పైచిలుకుతో గెలిపించారు. గతంలో అదే స్థానాన్ని మేము 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఇప్పుడు 50 శాతం ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఆశీర్వదించారు. హుజూర్‌నగర్‌ ప్రజలు ఏయే ఆశలు, నమ్మకాలు పెట్టుకుని టీఆర్‌ఎస్‌ను గెలిపించారో వందశాతం వాళ్ల కోరికలు తీర్చుతామని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ తెచ్చిన బాధ్యతతో పనిచేస్తున్నాం
తాము రాష్ట్రం తెచ్చినవాళ్లం. దాని మంచిచెడ్డలు తెలుసు కాబ్బటే దాన్ని ట్రాక్‌లో పెట్టడం అనేవి తాము చాలా సీరియస్‌గా భావిస్తాం అని కెసిర్‌ అన్నారు.  ఉద్యమ సమయంలో చేసిన వాదన, తెలంగాణ అనుభవించిన కష్టాలు స్పష్టంగా తెలుసు కాబట్టి రాష్టావ్రతరణ అనంతరం కొన్ని తక్షణ రిలీఫ్‌ కావాలి కాబట్టి తామ తీవ్రంగా తీసుకుని వాటిపై పనిచేసినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ భవన్‌లో
విూడియాతో సీఎం మాట్లాడుతూ.. తక్షణ ఉపశమన చర్యల్లో భాగంగా కొన్ని పనులు తీసుకున్నట్లు చెప్పారు. ఉదాహరణకు కరెంటు సమస్య.. రాష్ట్రంలో నేడు విద్యుత్‌ సమస్య లేదు. తాగునీటి రంగం.. సింగూరు ద్వారా ఐదారు నియోజకవర్గాలు తప్పిస్తే రాష్ట్రంలో నేడు ఎక్కడా తాగునీటి సమస్య లేదు. సాగునీటి రంగం.. కాళేశ్వరం దాదాపు పూర్తికావొస్తుంది. పాలమూరు ఫుల్‌ స్పీడ్‌తో సాగుతుంది. సీతారామ పూర్తి కావొచ్చింది. దేవాదుల 90 శాతం పూర్తియింది. ఈ నాలుగు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ సాగునీటి రంగం అద్భుతంగా ఉంటుంది. ఆ దిశగానే పయనిస్తున్నాం. ఇక సంక్షేమరంగం.. ఇది కూడా అనితర సాధ్యమైన రీతిలో రాష్ట్రంలో అమలు చేసుకుంటున్నట్లు సీఎం తెలిపారు.
నవంబర్‌లోనే మున్సిపల్‌ ఎన్నికలు
నవంబర్‌ నెలలోనే మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి అవుతాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. పల్లె ప్రగతి ప్రణాళిక
కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీవారు మెచ్చుకుంటున్నరు. మంచి సత్ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెండు నూతన చట్టాలు తెచ్చింది. గ్రామపంచాయతీ చట్టం, కొత్త మున్సిపల్‌ చట్టం తెచ్చాం. రెవెన్యూ చట్టం రావాల్సి ఉంది. గ్రామ పంచాయతీ చట్టం, మున్సిపల్‌ చట్టం ద్వారా నియంత్రిత విధానంలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధి జరగాలి. ఉత్త మాటలు చెప్పి అభివృద్ధి అంటే కుదరదు. అందుకు నిధులు సమకూర్చాలి. సెంట్రల్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ ఇచ్చే గ్రాంట్స్‌తో పాటు అంతే స్థాయిలో స్టేట్‌ ్గ/నాన్స్‌ కమిషన్‌ ద్వారా ఇచ్చి అభివృద్ధి చేయాలనుకున్నం. గ్రామపంచాయతీలకు ప్రతీనెల రూ.339 కోట్లను విడుదల చేస్తున్నాం. మున్సిపాలిటీలకు కూడా ఇప్పుడు రూ. 1030 కోట్లు 14వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నవి. ఇంతే మొత్తంలో తాము కూడా బ్జడెట్‌లో నిధులు కేటాయించాం. మొత్తం కలిపి రూ. 2060 కోట్లను రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల అభివృద్ధికి కేటాయించనున్నట్లు చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు బెంచ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది, మరో సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి వద్ద మరికొన్ని కేసులు ఉన్నవి. రేపు వాటిపై తీర్పు వస్తుంది. తీర్పు అనంతరం ఈసీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వస్తది. వచ్చిన వెంటనే నోటిఫికేషన్‌ వెలువరిస్తం. నవంబర్‌ మాసంలోనే మున్సిపల్‌ ఎన్నికలను పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల అనంతరం పట్టణ ప్రగతి ప్రణాళిక కూడా ఒక నెల పాటు చేపడతామని సీఎం తెలిపారు.