యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ డిసెంబర్28//.
టైటిల్ : దళిత మహిళా ఉపసర్పంచ్ కి అవమానం..
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బి.ఆర్ .స్ పార్టీ 6 వార్డ్ సభ్యులు మరియు ఉప సర్పంచ్ గా విధులు నిర్వహిస్తున్న తలారి హేమలతకు అవమాన౦ చోటుచేసుకుంది. గ్రామపంచాయతీలో గల పాలకవర్గం పట్టికలో ఉప సర్పంచ్ అనే పేరును తొలగించారు.
గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం ప్రజల కోసం శ్రమిస్తున్న నాకు ఇంతగా అవమానపరచడం ఏమిటని తలారి హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నీచ రాజకీయాలు గతంలో నేనెప్పుడూ చూడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు .దీనికి సంబంధించిన వివరాలను తెలియజేయాలన్నారు.
తుర్కపల్లి సర్పంచ్ పై అధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు.




