Wednesday, 4 November 2026

విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్

 

 

 

 

 

 

వేములవాడ, ఫిబ్రవరి 7, జనం సాక్షి : భారత విద్యార్థి ఫెడరేషన్ ( SFI )రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినభారీ బడ్జెట్లో మరొకసారి విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మొత్తం బడ్జెట్ 2,90396 కోట్లలో లో కేవలం 19093 కోట్ల కేటాయింపులు (6.57%) కి మాత్రమే పరిమితం చేయడం విద్యారంగం పట్ల ప్రభుత్వ వైఖరి అర్థమవుతుంది.వీటిలో పాఠశాల విద్యాశాఖకు కేవలం 16092 కోట్లు (5.54%) మరియు ఉన్నత విద్యకు 3001 కోట్లు (1%) కేటాయించారు.మొత్తం బడ్జెట్ 2,90,396 కోట్లలో, కనీసం 10%నిధులు కూడా కేటాయించలేదు.అంటే విద్యారంగం పట్ల ప్రభుత్వ చిత్త శుద్ది ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది.
ఈ సారి ఉన్నత విద్యకు సంబంధించి 3001 కోట్ల రూపాయలు (1%) మాత్రమే కేటాయించి, దాన్లోంచి 500 కోట్లు విశ్వ విద్యాలయాలలోని మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించడం జరిగింది. తద్వారా ఉన్నత విద్యలో కూడా నామమాత్ర కేటాయింపులేనని అర్థమౌతుంది. బడ్జెట్ లో కేటాయించిన నిధులు యూనివర్సిటీ లో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోలేదు.నేడు పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచలేదు.అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమల్లోకి తెస్తమని చెప్పిన మన ఊరు-మనబడి పేరుతో పాఠశాల లను అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం పోయిన సంవత్సరం బడ్జెట్ లో కూడా ఆ పథకానికి ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. చేయకపోవడం వల్ల ఆ పథకం అమలకు పూర్తిగా నోచుకోలేదు.దానికి సంబంధించిన రెండవ దఫా కేటాయింపులనైన ఈసారి బడ్జెట్ లో ఎక్కడా ప్రస్తావించకపోవడం శోచనీయం.గత సంవత్సర కేటాయింపుల కంటే ఈ బడ్జెట్ లో (0.31)% నిధులు ఎక్కువ అనిపించినా మొత్తంగా పెండింగ్ లో నున్న ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్ షిప్ బకాయిలు,విశ్వ విద్యాలయాల అభివృద్ధి గురుకులాల అభివృద్ధి,మన ఊరి మన బడి, లాంటి ముఖ్య పథకాల అమలుకు ఇనిధులు ఏ మాత్రం సరిపోవు.ప్రభుత్వం కేటాయించిన అరకొర నిధులతో విద్యారంగం మరింత బలహీనపడుతుంది.కాబట్టిప్రభుత్వం విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ పునర్:సమీక్ష చేయాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, నాయకులు హేమంత్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.