వీధిలైట్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలి
మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్.
మిర్యాలగూడ, జనం సాక్షి
పట్టణాల్లో వీధిలైట్లన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ కోరారు. పట్టణ పరిధిలోని వీధిలైట్ల నిర్వహణపై మున్సిపల్ పరిధిలో గల విద్యుత్ దీపాల నిర్వహణ శాఖ వారితో సోమవారం తన కార్యాలయం లో సమావేశం అయ్యారు. వారితో పట్టణం లో ఉన్న వీధి దీపాలు మరియు నిరంతరం వెలుగుతున్న ఏరియాల గూర్చి చర్చించి పలు సూచనలు చేశారు.
సమావేశం లో మున్సిపల్ కమీషనర్ రవీంద్ర సాగర్ . ఇంజనీర్ సాయిలక్మీ . ఏ ఈ సల్మాన్ మరియు సిబ్బంది పాల్గోన్నారు




