Friday, 6 November 2026

ప్రభుత్వ విద్యాసంస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం

ప్రభుత్వ విద్యాసంస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
స్థానిక తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కరానికై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
డిసెంబర్ 1,2,3, నా జరిగే పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర 22వ మహాసభలను విజయవంతం చేయండి.
పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి.
తాండూరు నవంబర్ 29(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ప్రభుత్వ విద్యాసంస్థలైన ప్రాథమిక పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి నెలకొందని అదేవిధంగా ఎప్పుడు కూలిపోతాయో తెలవని శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలలో విద్యావ్యవస్థ నడుస్తుందని పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక తాండూర్ పట్టణంలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు 2 వేల మంది వరకు విద్యార్థులు చదువుతున్నప్పటికీ సరిపడే తరగతులు లేక బయట కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడిందని, ప్రహరిగోడ కూలిపోవడంతో బయట నుండి ఆటోలు ప్రైవేటు వాహనాలు గ్రౌండ్ లోకి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నా రని దానికి తోడు కనీసం గేటుకు తాళం వేసే వాచ్మెన్ కూడా లేకపోవడం బాధాకరమని తెలిపారు రోజురోజుకు తాండూర్ నియోజక వర్గంలో ప్రైవేట్ స్కూలు మరియు కార్పొరేట్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా పిడిఎస్ యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ విద్యాసంస్థల పరిరక్షణకై , కార్పొరేట్ మరియు ప్రైవేటు ఫీజుల దోపిడి అరికట్టాలని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు