సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి కీరాభిషేకం.
26వ వార్డు కౌన్సిలర్ మంకాళ్ రాఘవేందర్.
తాండూరు నవంబర్ 29(జనంసాక్షి)సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకొని అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి 26వ వార్డు కౌన్సిలర్ మంకాళ్ రాఘవేందర్ పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో కోలువుదిరీన ఆయ్యప్ప స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా 26వ వార్డు కౌన్సిలర్ మంకాళ్ రాఘవేందర్ మాట్లాడుతూ భక్తిశ్రద్ధల తో భగవంతుని ప్రార్థిస్తే సకల సౌభాగ్యాలు కల్పిస్తారని పేర్కొన్నారు.సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి ఉండాలని పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛ రణాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి కీరాభిషేకం.




