Sunday, 8 November 2026

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారిని కలిసిన టీఎస్ యుటిఎఫ్ నాయకులు

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారిని కలిసిన టీఎస్ యుటిఎఫ్ నాయకులు
* ఐటీడీఏ అధికారులతో మాట్లాడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
* గత4 నెలల క్రితం ఉన్నత విద్య కొరకు నిరభ్యంతర పత్రము జారీ చేయాలని దరఖాస్తులు చేసుకున్న ఉపాధ్యాయులు
* ఆంధ్ర కాలేజీలలో చదివే వారికి ఎన్ ఓ సి ఇవ్వబోమంటూ నిబంధనలు
* తెలంగాణలోని టాప్ టెన్ కాలేజీలలో చేరలంటూ కొర్రీలు
* ఆందోళనలో గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయులు.

టేకులపల్లి, డిసెంబర్ 25( జనం సాక్షి ): భద్రాచలంలో టీఎస్ యుటిఎఫ్ నాయకులు ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ శాశన సభ్యులు రేగా కాంతారావుని కలిసి భద్రాచలం ఐ టి డి ఎ పరిధిలో గల గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయులు ఎదురుకొంటున్న పలు రకాల సమస్యలను రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లి ఆదివారం వివరించారు. భద్రాచలం పరిధిలోని గిరిజన సంక్షేమశాఖలో పనిచేయుచున్న ఉపాధ్యాయులు ఇన్ సర్వీస్ లో ఉన్నత చదువులు బిఈడి / బీపీఈడి చదువుట కొరకు 4 నెలల క్రితం 36 మంది ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసి ఉన్నారని, అధికారులు ఆంధ్ర కళాశాలలో చేరిన వారికి నిరభ్యంత పత్రము ఇవ్వబోమంటూ తెలుపుతున్నారు. ఆంధ్ర కళాశాలలో చేరిన అభ్యర్థులు అక్కడ చెల్లించిన ఫీజులు నష్ట పోయి తెలంగాణ కాలేజీలో చేరినారు. ఇప్పుడు అధికారులు తెలంగాణ లోని టాప్ టెన్ కాలేజీలలో చేరితేనే నిరభ్యంతర పత్రము జారీ చేస్తామని కొర్రీలు పెడుతూ, ప్రభుత్వం జారీచేసేన జీవో 342 ను తుంగలో తొక్కి ఉన్నత విద్యా అభ్యసించాలనుకున్న గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అదేవిధంగా కన్వెర్టెడ్ ఆశ్రమ హోస్టెల్స్ లలో ఒకటి కంటే ఎక్కువ హోస్టెల్స్ కు ఇంచార్జిలు గా ఉన్నవారి డెప్యూటషన్స్ రద్దుచేయకుండా, హెచ్ డబ్ల్యు ఓ ల డెప్యూటషన్ రద్దు అంటూనే, వారిని డెప్యూటషన్ పై ఇతర హోస్టెల్స్ కు పంపడంలో మర్మము దాగి ఉన