Wednesday, 4 November 2026

ప్రభుత్వ సేవలు సద్వినియోగం చేసుకోవాలి

 

 

 

 

 

 

 

శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 7మహిళలల, చంటి పిల్లల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ అంగన్వాడి సూపర్వైజర్ స్రవంతి మహిళలకు సూచించారు. మంగళవారం శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలోని ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రంలో మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చట్టి పిల్లలకు అక్షరాభ్యాసం, పౌష్టిక ఆహారం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సూపర్వైజర్ స్రవంతి మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు , చిన్నారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని కోరారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ కేంద్రాల ద్వారా మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, చంటి పిల్లల తల్లులకు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని వెల్లడించారు .ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సోనీ, మమతా, కమలాబాయి, ఆయాలు మహిళలు, గర్భిణీ స్త్రీలు ,చంటి పిల్లల తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.