మండలంలో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
వీణవంక డిసెంబర్ 25 (జనం సాక్షి)వీణవంక మండల కేంద్రంతో పాటు గన్ముకుల గ్రామంలో షారోన్ ప్రార్ధన మందిరం ఆదివారం క్రిస్మస్ పండుగను ఘనంగా పురస్కరించుకుని జరిగిన క్రైస్తవ సోదరుల ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరై
కేక్ కట్ చేసి క్రైస్తవ ఫాస్టర్లకు, క్రైస్తవ సోదర, సోదరీ మణులకు తినిపించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 1000 మందికి సోదరీమణులకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను మనము జరుపుకుంటున్నాము ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో పాస్టర్ రామలింగారెడ్డి, ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వీణవంక స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి ఘన్ముకల గ్రామ సర్పంచ్ సునీత మల్లారెడ్డి, ఎంపిటిసి నాగిడి సంజీవరెడ్డి, సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, నాయకులు దేశిని కోటి. దయ్యాల శ్రీనివాస్. ఉపసర్పంచ్ కొమురయ్య వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.




