సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులు.ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో డిసెంబర్ 26వ తేదీ నుంచి జరిగిన జాతీయ సబ్ జూనియర్స్ బ్యాడ్మింటన్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు పథకాలు సాధించి సత్తా చాటారు అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ తెలిపారు, అండర్ 17 బాలుర సింగిల్స్ లో రోషన్ కుమార్ ఆనంద్ దాస్ రాజ్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించగా,షేక్ నుమేర్ సిల్వర్ మెడల్ సాధించాడు, వీరిరువురు బాలురు డబుల్ స్లో బ్రాంచ్ మెడల్స్ సాధించారు, అండర్ 15 బాలుర విభాగంలో డబుల్ స్లో జ్ఞాన దత్ సిల్వర్ మెడల్ సాధించాడు, బాలికల డబుల్ స్లో నైనిక రెడ్డి, షికా బ్రాంచ్ మెడల్ సాధించారు, మిక్స్ డబుల్స్ లో కీర్తి మంచాల బ్రాంచ్ మెడల్ సాధించారు, కోచ్ నీల్ కమల్, అన్వేష్ సలహాలు సూచనల మేరకు మేనేజర్ లు పుల్లూరి సుధాకర్, సత్యపాల్ రెడ్డి లా ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడకారులు పథకాల సాధించినట్లు తెలిపారు, జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులను ఇందుకు కృషి చేసిన కోచ్లు మేనేజర్లను జిల్లా అధ్యక్షుడు బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ ప్రత్యేకంగా అభినందించారు,…………….జనం సాక్షి
సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులు.ఒరిస్సా రాష్ట్రంలోని




