Tuesday, 3 November 2026

ప్రమాదపు శాత్తు అవుట్ సోర్సింగ్ వెల్డర్ మృతి

ప్రమాదపు శాత్తు అవుట్ సోర్సింగ్ వెల్డర్ మృతి
* నవభారత్ లో పనిచేస్తూ ప్రమాదం
* టేకులపల్లి మండలంలోని సులానగర్ నివాసి

టేకులపల్లి, జనవరి 3( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన దామల్ల బాబురావు (33) నవభారత్ లో ఔట్సోర్సింగ్ వెల్డర్ గా పనిచేస్తున్నాడు. రోజువారి డ్యూటికి క్రమంగా వెళుతూ అదే క్రమంలో మంగళవారం నవభారత్ లో పనిచేస్తుండగా ప్రమాదపు శాత్తు బెల్టు తగిలి తలకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ బాబురావు మృతి చెందాడు. కాగా నవభారతలో ప్రమాదం ఎలా జరిగిందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భార్య, ఒక కూతురు ఉన్నారు. బాబురావు మృతి చెందాడు అనే విషయం తెలియగానే సులానగర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.