సేవా దృక్పథంలో మోటం కోమల కు సావిత్రిబాయి పూలే అవార్డు అందజేత
వీణవంక జనవరి 3 (జనం సాక్షి )వీణవంక మండల కేంద్రాన్ని చెందిన మోటం కోమల- వెంకటేష్ దంపతులు గత కొన్ని సంవత్సరాల నుండి సిమెంట్ ఇటుకల తయారీ చేసుకుంటూ జీవనాన్ని గడుపుతూ, సమాజానికి సేవ చేయాలన్న దృక్పథంతో, బీదస్తులు కుటుంబం నుండి మరణించిన వారి సమాధి నిర్మాణానికి ఇటుకలను ఉచితంగా అందజేస్తూ, గ్రామస్తుల ఆధార అభిమానుల పొందుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మంగళవారం రోజున సావిత్రిబాయి పూలే 192వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో సేవా దృక్పథంలో మోటం కోమల-కు సావిత్రి బాయి పూలే అవార్డును అందజేశారు. అనంతరం మోటం కోమల మాట్లాడుతూ… వీణవంక గ్రామంలో సిమెంట్ ఇటుకల పరిశ్రమతో నెలకొల్పి, సమాజానికి మా వంతుగా సేవ చేస్తూ, మరణించిన కుటుంబాలకు ఉచితంగా ఇటుకలను అందజేస్తూ, ప్రజల మన్నలను పొందుతున్నామని, స్వయం శక్తితో వ్యాపారం చేస్తూ, మరి కొంతమందికి ఉపాధిని కల్పించవచ్చునని రుజువు చేశామని, మా పరిశ్రమకు నిత్యం మా కుటుంబ సభ్యుల సహకారాలతో మరింత అభివృద్ధి పొందుతూ, గ్రామంలోని నిరుద్యోగులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నామని అన్నారు. ఈ అవార్డు ప్రధాన కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మెంబర్ రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్పర్సన్ మనీ మంజరి, కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళ అధ్యక్షురాలు ఐల ప్రసన్న, మోత్కూరి శ్రీనివాస్, అరుణ రాణి తదితరులు ఉన్నారు.




