Sunday, 8 November 2026

ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం.

ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం…

– బైంసా పురాణ బజార్లోన్ ఘటన…

– భారీసారిలు,ఫికోపాల్స్ అగ్నికి ఆహుతి అయ్యి లక్షల్లో నష్టం…

భైంసా రూరల్ డిసెంబర్ 26 జనం సాక్షి

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పురాణ బజారు ఓ ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయింది. కాలనీకి చెందిన శ్యామ్ సుందర్ భార్య శకుంతల మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశం తో ఇంటినే షాపింగ్ మాల్ గా మార్చి చీరలు,పికో ఫాల్స్, భారీ డిజైన్ శారీస్ లాంటివి అమ్ముకుంటూ ఉంటారు. అయితే సోమవారం ఉదయం దాదాపు 10 గంటల సమయంలో ప్రమాదవశాత్తు అగ్ని మంటలు చెలరేగి ఇల్లు మొత్తం కాలిపోయే పరిస్థితి ఏర్పడింది. సంక్రాంతి పండుగ నిమిత్తం బిజినెస్ బాగా సాగాలని ఈ మధ్యనే లక్షల రూపాయలలో విలువ చేసే సారీస్ ను ఇంట్లో డంపు చేసుకో0ది. తీరా బిజినెస్ కాకముందే ఇలా ప్రమాదవశాతంతో ఇల్లు ఖాళీ, చీరలు కాలిపోవడంతో లక్షల్లో నష్టం చేకూరింది. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్ కి కాల్ చేయడంతో ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంది. షార్ట్ సర్క్యూట్ ప్రమాదం తోటే అగ్ని ప్రమాదం సంభవించిందని తోటి కాలనీవాసులు గుసగుసలాడుకుంటున్నారు.