Saturday, 7 November 2026

బిజెపి మండల ఉపాధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి

బిజెపి మండల ఉపాధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి…
శంకరపట్నం: జనం సాక్షి డిసెంబర్ 24
భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండల శాఖ ఉపాధ్యక్షుడిగా అన్నాడి మహేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా నియామకం చేసినట్లు ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చల్ల ఐలయ్య శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుడాటి పల్లెకు చెందిన అన్నాడి మహేందర్ రెడ్డి బిజెపి కార్యకర్తగా పార్టీకి గత కొన్ని ఏళ్ల నుండి సేవలందిస్తున్నాడని ఆయన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడి ఆదేశం మేరకు శంకరపట్నం మండల శాఖ టీవీ ఉపాధ్యక్షులు నియామకం చేసి నియామక పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన నాయకులకు మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత మూర్చ మండల శాఖ అధ్యక్షుడు కన కం సాగర్, ఎస్టి మోర్చా మండల శాఖ అధ్యక్షుడు బిజిలి సారయ్య, నాయకులు జంగా జైపాల్, దాసా రపు మహేందర్, శ్రీనివాసరెడ్డి, వీరా అర్జున్, జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.