Tuesday, 3 November 2026

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

శనివారం అదృశ్యం అయి సోమవారం శవం అయి తేలిన వ్యక్తి
లింగంపేట్(జనంసాక్షి)సోమవారం* కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ఐ లాపూర్ గ్రామానికి చెందిన వాన్నే పల్లి శుభష్ వయసు(40) శనివారం రోజు సాయంత్రం 6.00 గంటలకు కలకృత్యాలకు వెళ్లి తిరిగి రాకపోవడం తో తమ కుటుంబ సభ్యులు లింగంపేట్ యస్.ఐ సంపత్ కుమార్ కు పిర్యాదు చేయగా వారు అదృశ్య కేసు నమోదు చేశారు.అంతలోనే సోమవారంనాడు ఉదయం శవం అయి పైకి తేలడంతో ఆ శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు అని లింగంపేట్ యస్.ఐ. సంపత్ కుమార్ తెలిపారు.