అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు
సిద్దిపేట,అగస్టు24(జనంసాక్షి): మంత్రి హరీశ్‌రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో మంత్రి హరీశ్‌రావు ఎప్పుడు ముందే ఉంటారు. జిల్లాలోని మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ రహదారిపై మంగంళవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ..చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి భార్య, పిల్లకు గాయాలయ్యాయి. అదే దారిలో ప్రయాణిస్తున్న మంత్రి హరీశ్‌రావు ప్రమాదాన్ని చూసి ఆగారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరుండి అంబులెన్స్‌లో సిద్దిపేట దవాఖానకు పంపించారు. మంత్రి చొరవకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రమాద బాధితులకు మంత్రి అండ




