రుకు గదుల్లో గ్రామ పరిపాలన…. * పాతవి శిథిలం,కొత్తవి ఇరుకు గదుల్లో కొనసాగింపు * నిర్మాణం చేపట్టినవి అసంపూర్తి * ఇబ్బందులు పడుతున్న పాలకవర్గం సభ్యులు,సిబ్బంది కొల్చారం(నర్సాపూర్):ప్రజా పాలన గ్రామస్థాయి నుండి మొదలవుతుందన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరిగినదే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీలు పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించగా ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకొన్నాయి. గ్రామపంచాయతీ పాలకవర్గం సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.ఉన్న రెండు గదులు కూడా పెరిగిన పరిపాలన విభాగాలతో ఇరుకు గదుల్లో కూర్చునేందుకు వీలులేకుండా తయారయ్యాయి.మరోవైపు కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేక పోవడం చిన్న పాటి అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, నధులు మంజూరు అయిన భవనాలు అసంపూర్తి దశలో దర్శనమిస్తున్నాయి.ఇది కొల్చారం మండల గ్రామ పంచాయతీల తీరు. * మండలం లో గ్రామ పంచాయతీలు…. — కొల్చారం మండలం లో ఐదేళ్ల క్రితం మొత్తం16 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 వేల జనాభా కలిగిన
రుకు గదుల్లో గ్రామ పరిపాలన…. * పాతవి శిథిలం,కొత్తవి ఇరుకు




