Tuesday, 3 November 2026

ప్రముఖనటుడు చంద్రమోహన్ కన్నుమూత

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆయన. ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు.నేడు ఉదయం 9.45 గంటలకు ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతికి అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

చంద్ర మోహన్ 81 ఏళ్ళ వయసులో మరణించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేడు, రేపు అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచి సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.