ప్రముఖ టీవీ నటి, తమిళనాడు యాక్టర్ నందిని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలోని ఓ లాడ్జిలో కార్తికయన్ విషం తాగి చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. శరవణన్ మీనాక్షి సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది నందిని. వంశం అనే సీరియల్ కూడా పేరు తీసుకొచ్చింది. రియాల్టీ షోలకు జడ్జి వ్యవహరిస్తుంది నందిని. ఈ సమయంలోనే చెన్నైలో జిమ్ నిర్వహిస్తున్న కార్తికేయన్ తో పరిచయం ఏర్పడింది. ఫిట్ నెస్ కోసం నందిని అక్కడికి వెళుతుండేది. వీళ్లద్దరి పరిచయం ప్రేమగా మారింది. నందిని – కార్తికేయన్ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. సింగిల్ గా ఉంటున్నానని మార్చిలో నందిని ఫేస్ బుక్ లో కామెంట్ చేయటం అప్పట్లోనే సంచలనం అయ్యింది. కార్తికేయన్ అవినీతి వ్యాపారాలు నిర్వహిస్తున్నాడని కూడా చెప్పుకొచ్చింది. అతని వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఉంటే.. డబ్బు కూడా సర్దుబాటు చేసినట్లు చెప్పింది. కార్తికేయన్ ఆత్మహత్య చేసుకుంటూ తన చావుకి నందిని తల్లిదండ్రులు కారణం అని సూసైడ్ నోట్ రాశాడు. దీనిపైన కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ విషయాన్ని నందిని ఖండించింది. నా తల్లిదండ్రుల ప్రేమయం ఏమీ లేదని తెలిపింది. ఓ ప్రముఖ టీవీ నటి భర్త ఆత్మహత్య తమిళనాట కలకలం రేపింది. ప్రతి ఇంట్లో చర్చ అయ్యింది. మీనాక్షి సీరియల్ ద్వారా పాపులర్ అయిన నటి కావటం.. రెగ్యులర్ గా టీవీలో కనిపిస్తూ అందరికీ సుపరిచితురాలు కావటం చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల జయసుధ భర్త ఆత్మహత్య తర్వాత.. మరో నటి భర్త కూడా ఇదే తరహాలో చనిపోవటం ఆశ్చర్యం.




