హైదరాబాద్: అలనాటి ప్రముఖ దర్శకుడు, నిర్మాత సివీ రంగనాథ దాస్ ఈరోజ ఉదయం హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన రంగనాథదాస్ మహానటులు రామారావు, నాగేశ్వరరావులతో ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో సంతానం, సంసారం లాంటి చిత్రాలు నిర్మించారు. లతా మంగేష్కర్ చేత తొలి తెలుగుపాట పాడించిన ఘనత ఆయనదే. సంతానం చిత్రం కోసం ఆమె పాడించిన ఘనత ఆయనదే. సంతానం చిత్రం కోసం ఆమె పాడిన ‘ నిదురపోరా తమ్ముడా.. ‘ అన్న పాట తెలియని తెలుగువారు ఉండదు. మహానటి సావిత్రిని వెండితెరకు పరిచయం చేసింది. ఆయనే. దర్శక నిర్మాతగా దాసి, తోబుట్టువు, సంకల్పం అనే చిత్రాలు తీశారు. ఆయనకు ముగ్గురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు.




