తెలిపిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొండమల్లేపల్లి ఫిబ్రవరి 6 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్ దూదిపాల వేణుధ రెడ్డికి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి వైద్యరంగంలో 24 గంటలు ప్రజలకు సేవలు అందిస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని వారు ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ హృదయపూర్వకంగా అభినందించారు వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని వారి విలువైన సేవలు ప్రజలకు అందించాలని దేవరకొండ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారని డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు




