అగర్తలా : త్రిపురలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నానికి 40 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మాట్లాడుతూ వరసగా నాలుగోసారీ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ గత మూడు ఎన్నికల్లోనూ లెఫ్ట్ ఫ్రంట్ విజయకేతనం ఎగరేసింది. 60 మంది సభ్యులున్న త్రిపుర అసెంబ్లీలో భాజపా ఇంతవరకూ ఎప్పుడూ బోణీ చేయలేదు. ఈ సారి ఆ పార్టీ 20 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది.




