ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో చోరీ

తిరుపతి: తిరుపతి సమీపంలో తుమ్మల గుంట ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. స్వామి వెండి కిరీటం, హారాలు, ఒక నేత్రం, వెండి బొట్టును అపహరించారు. క్రైం డీఎస్పీ స్వామి, రూరల్‌ సీఐ సుబ్రహ్మణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు.