Wednesday, 4 November 2026

ప్రసవానంతర మానసిక ఆరోగ్యం గురించి వైద్యాధికారులకు శిక్షణ

గద్వాల నడిగడ్డ, జూన్ 23 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ .శశికళ,డిప్యూటీ. డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప , డాక్టర్ స్రవంశు సంరక్షణ కేంద్రంలో శిక్షణ నిర్వహించారు..స్త్రీలు గర్భం దాల్చినప్పుడు, కాన్పు సమయంలో ,ప్రసవానంతరము సంవత్సరం వరకు, అనేక మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారని, అందువల్ల ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు ఈ మానసిక సమస్యల గురించి గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు..ముఖ్యంగా గర్భిణీ సమయంలో తి గారి అధ్యక్షతన, డాక్టర్ రవీనా, సి. ప్రమీలారాణి శుక్రవారం వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులకు ప్రసవానంతర మానసిక ఆరోగ్యం గురించి”,మాతా శిగర్భిణీ స్త్రీలకు కాన్పు గురించి ఆందోళన, ఆత్రుత, డిప్రెషన్, ఉంటుందని , కాబట్టి వైద్య సిబ్బంది గర్భిణీ స్త్రీలకు ఈ మానసిక వ్యాధుల గురించి అవగాహన కలిగించి, ఒకవేళ గర్భిణీ స్త్రీలకు మానసిక వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లయితే సాధ్యమైనంత తొందరగా వైద్యాధికారులకు చూపించాలని తెలిపారు. కొంతమంది గర్భిణీ స్త్రీలకు మగ పిల్ల/ఆడపిల్ల పుడుతుందా అని ఆందోళన, గర్భిణీ స్త్రీల కు ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహము కూడా ఉండకపోవడం, ఇంకా కొంతమంది గర్భిణీలకు ఇంట్లో గృహింస వల్ల కూడా గర్భిణీ స్త్రీలు అనేక రకమైన మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు కొంతమంది గర్భిణీ స్త్రీలుసరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల, వారి యొక్క ఆర్థిక స్తోమత సక్రమంగా లేనందువల్ల, కాన్పుకు భర్త,అత్త ,మామ, పుట్టింటి వారి సహకారం లేనందువల్ల,ఇంట్లో ఎప్పుడు కుటుంబ కలహాల వల్ల ,గర్భిణీ స్త్రీలు అనేక రకములైన మానసిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలు , ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు అందరూ , గర్భిణీ స్త్రీలకు ఉన్న మానసిక సమస్యలను తొందరగా గుర్తించి, చికిత్స చేయవలసిందిగా సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎస్. స్రవంతి, ప్రోగ్రాం ఆఫీసర్ ఎన్సిడి, డాక్టర్ .రాజు , వైద్య సిబ్బంది, కోట్ల మధుసూదన్ రెడ్డి, వరలక్ష్మి, రామాంజనేయులు మాధవి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.